Choose Language:

Shivashankar Sutar

  • Group:art exhibition

Shivashankar Sutar

కర్నాటకలోని గుల్బర్గా జిల్లా బందర్‌వాడ్‌లో జన్మించిన శివశంకర్‌, ఎం.ఎం.కె విశువల్‌ ఆర్ట్స్‌ నుండి బి.ఎఫ్.ఎ, ఎం.వి.ఎ పట్టా పొందారు. మైసూర్‌లో జరిగిన 46వ జాతీయ స్థాయి వర్క్‌షాప్, చిత్రదుర్గలో జరిగిన కర్ణాటక లలిత కళా అకాడమీ ఆర్ట్ క్యాంప్, గదగ్‌లోని కర్ణాటక లలిత కళా అకాడమీ డిజిటల్ వర్క్‌షాప్, పంజాబ్‌లో కె.ఎల్.ఎ మరియు ఎల్. పి.యు ద్వారా జరిగిన జాతీయ స్థాయి పెయింటింగ్ క్యాంప్ మరియు నేషనల్ లెవల్ పెయింటింగ్ క్యాంప్‌ ఇలా పలు కళా శిబిరాలలో ఆయన పాల్గొన్నారు. కోల్‌కతాలోని గోర్కీ సదన్‌లో జరిగిన యూత్ గిల్డ్ ఫర్ ఫ్రెండ్‌షిప్, ఢిల్లీలోని పెయింట్ మై థాట్, బాంబే ఆర్ట్ సొసైటీ ఎగ్జిబిషన్ వంటి అనేక ప్రదర్శనలలో సుతార్‌ తన కళలను ప్రదర్శించారు. బెంగుళూరులోని కన్నడ సాంస్కృతిక శాఖ, వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ, ధార్వాడ్‌ ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీలు ఆయన కళళ ప్రదర్శన కోసం ప్రాయోజకత్వం వహించాయి. అతను గుల్బర్గా యూనివర్సిటీ రాజ్యోత్సవ పురస్కారం, ప్రఫుల్ల దహనుకర్ కలానంద పోటీలో ప్రింట్ మేకింగ్ కోసం బంగారు పతకం (2016), ఆర్ట్ బెరు జెర్మినేషన్ కాంటెంపరరీ ఆర్ట్ ఎగ్జిబిషన్ స్పెషల్ జ్యూరీ అవార్డు (2023)తో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo