విశ్వనాథ్ హెగడె కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాకు చెందినవారు. గ్రామీణ సంస్కృతి, పట్టణ సంస్కృతులను మమేకం చేసి విభిన్నంగా చిత్రించే కళ అతని సొంతం. ఆయన ఉపయోగించే ట్విస్టెడ్ కలర్ థ్రెడ్లు కళాకృతికి వైవిధ్యమైన ఆకృతి, పరిమాణం మరియు డైనమిక్ నాణ్యతను అందిస్తాయి. శిల్పకళలో కూడా ఇలాంటి సాంకేతికతను ఆయన ప్రయోగిస్తున్నారు. పాక ప్రపంచాన్ని అన్వేషించడం, కళాకృతులను రూపొందించేందుకుగాను ఆయన ఉపయోగించే సంప్రదాయ ఆహార పదార్థాల రంగులు, నమూనాలు మరియు అల్లికలు ఆయన మరో ప్రత్యేకత.