లలిత కళల్లో పట్టా పొందిన రుద్రగౌడ బెంగుళూరులో కళాకారుడిగా తమ వృత్తిని ప్రారంభించారు. సమకాలీనత, వాస్తవాన్ని చిత్రించడం అతని ప్రత్యేకత. తన చిత్రాలలలో వాటర్ కలర్స్, ఆక్రిలిక్ ఇలా పలు మాధ్యమాలను ఆయన ఉపయోగిస్తారు. మహా నగరాల్లోని బ్రతుకు తీరు, పర్యావరణం, సమకాలీన రాజకీయ, సామాజిక విషయాలను ఆయన చిత్రిస్తారు. వివిధ ఆకారపు కాన్వాస్‌లు, స్టీల్ షీట్లు మరియు ప్రత్యేకమైన ఫ్రేమ్లను ఉపయోగించే అతని వినూత్నమైన ప్రయత్నాలు అతని కళకు కొత్త కోణాలను జోడించి, వాటిని మరింత చమత్కారంగా, ఆకర్షణీయంగా చేస్తాయి. అనేక జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలు మరియు సమూహ ప్రదర్శనలలో తన రచనలను ప్రదర్శించిన రుద్రగౌడ్ తన శైలి, ప్రదర్శన, విభిన్నమైన రంగులని వాడినందుకుగాను కలా ప్రియుల ప్రశంసలు పొందారు.