ఎం.ఎం.కె కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ గుల్బర్గా నుండి బి.వి.ఎ పెయింటింగ్‌లో పట్టా పొంది ఎం.వి.ఎ పెయింటింగ్ డిగ్రీలో రెండవ ర్యాంక్ పొందిన రామకృష్ణ నాయక్, మంగళూరు మహాలసా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుండి డిప్లోమా పొంది పెయింటింగ్ క్షేత్రంలో ఐదేళ్ళ పాటు కృషి చేసి ప్రస్తుతం ఫ్రీలాన్స్ కళాకారుడిగా పని చేస్తున్నారు. తన కళా కృషికిగాను 2022 లో కర్ణాటక లలితకలా అకాడెమి అవార్డు, 2013 లో కొంకణి సాహిత్య అకాడెమి అవార్డు, 2012 లో జి.ఈరణ్ణ స్కాలర్‌షిప్ అవార్డు ఇలా పలు పురస్కారాలను రామకృష్ణ నాయక్ అందుకున్నారు. అలాగే కఠ్మండులో జరిగే నేపాళ్ – ఇండియ పెయింటింగ్ ఆర్ట్ ఎక్సిబిషన్, దుబైలో జరిగే గ్లోబల్ ఆర్ట్ ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. 2016లో కొచ్చి ఆర్ట్ గేలరీ జరిపిన ʼట్రాన్స్‌ఫర్‌మేశన్ʼ, 2023 లో కర్ణాటక చిత్రకలా పరిషత్ ఆర్ట్ గేలరి నిర్వహించిన ʼస్పేస్ʼ ఎగ్సిబిషన్‌లలో ఆయన పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు ఆర్ట్ గేలరీలు, ముంబైలోని జహాంగీర్ ఆర్ట్ గేలరీ, బెంగుళూరులోని వెంకటప్ప ఆర్ట్ గేలరీలలో ఆయన తన చిత్రాలను ప్రదర్శించారు. కాల – దేశాల సానుకూల, ప్రతికూల ప్రభావాల ద్వంద్వత్వ ప్రదర్శన నుండి వెలువడే వాస్తవాన్ని అతని చిత్రాలు చిత్రిస్తాయి. అలాగే పర్యావరణానికి సంబంధించి పంచభూతాలైన అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశం అగోచరమైన శక్తులుగా మానవాళికి ఎంత ముఖ్యమో తెలిపే అతడి చిత్రాలు గమనార్హం.