బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి పెయింటింగ్లో పి.జి డిప్లొమా పొందిన మంజునాథ హొన్నపుర జాతీయ అవార్డు పొందిన కళాకారుడిగా పేరు పొందిన వ్యక్తి. భారతదేశం, బల్గేరియా, బంగ్లాదేశ్, మలేషియా మరియు అమేరిక అంతటా అనేక సోలో మరియు గ్రూప్ ఎగ్జిబిషన్లలో ఆయన పాల్గొన్నారు. 2022లో న్యూఢిల్లీలోని లలిత్ కళా అకాడమీ నిర్వహించిన 62వ జాతీయ కళా ప్రదర్శనలో జాతీయ అవార్డు, 2012లో ముంబైలోని వెస్ట్రన్ రీజియన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ క్యామ్లిన్ లిమిటెడ్ అవార్డు, మరియు ʼఇమాజినింగ్ అవర్ ఫ్యూచర్ టుగెదర్ʼలో సహభాగిత్వం ఇవి ఆయనకు లభించిన ప్రశంసలు. 2018లో కర్నాటక లలిత కళా అకాడమీ నుండి ప్రింట్ మేకింగ్ ఫెలోషిప్ని ఆయన పొందారు. మన దేశం అలాగే విదేశాల్లోని వివిధ కార్పొరేట్ హౌస్లు, గ్యాలరీలలో మంజునాథగారి కళలను గమనించవొచ్చు. అనేక సోలో మరియు గ్రూప్ షోలలో ఆయన పాల్గొన్నారు.