కర్ణాటకలోని రామదుర్గలో జన్మించిన గణేశ దొడ్డమని, ఎం.ఎం.కె గుల్బర్గా కాలేజ్ ఆఫ్ విజువల్ ఆర్ట్ నుండి బి.ఎఫ్.ఎ మరియు పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతన్లోని కళా భవన్ నుండి ఎం.వి.ఎ డిగ్రీలను పొందారు. భారతీయ సంస్కృతి, కళల పట్ల అభిరుచి ఉన్న ఆయన ఉత్తమ కళాకారుడిగా పేరు పొందారు. తన చిత్రాలలో వాస్తవికతని రూపుదిద్దే విధంగా రంగులు దిద్దడం ఆయన ప్రత్యేకత. కళాకారుడిగా పందొమ్మిదేళ్ళ తన అనుభవంలో మంచి కళాకారుడిగా ఆయన గుర్తింపు పొందారు. తన చిత్రాలలో లయ, వింత భావాలను సృష్టించే రంగులు వాడడం అతని ప్రత్యేకత. అతను భారతీయ సమకాలీన కళాకారుడిగా అనేక సోలో మరియు గ్రూప్ షోలను అందించారు. వర్ణకళా సాంస్కృతిక సంఘ్ అవార్డు, కర్ణాటక లలిత కళా అకాడమీ అవార్డు, కర్ణాటక ప్రభుత్వం అందించే హంపి జాతీయ అవార్డు వంటి అనేక అవార్డులను ఆయన అందుకున్నారు.