1981 లో జన్మించిన గణేశ్ ధారేశ్వర్, దావణగెరెలో ఉన్న యూనివర్సిటి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సంస్థనుండి బి.ఎఫ్.ఎ పెయింటింగ్లో పట్టా పొందారు. మునుపు లలితకలా అకాడెమిలో సభ్యునిగా పని చేసిన ఆయన ప్రస్తుతం బెంగుళూరులో ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్గా పని చేస్తున్నారు. సంప్రదాయికమైన ఆలోచనలు, సమకాలీన దృశ్య సంభాషణల మమేకంతో రూపుదిద్దుకొనే రచనలు అతని ప్రత్యేకత. ప్రకృతి, సాంకేతికత, మానవాళి ఉనికిని చాటడానికి అతను వాడే విభిన్నమైన రంగులు, ఆకారాలు, అల్లికల కూర్పు తన రచనని ఆకర్షవంతంగా తీర్చి దిద్దుతుంది. బి.ఎఫ్.ఎలో మూడు బంగారు పథకాలు అందుకున్న గణేశ్, ʼయువకలామేళ అవార్డుʼ, ʼకళా ప్రతిభోత్సవ అవార్డుʼ, ʼరాష్ట్ర సాంస్కృతిక శాఖ అందించే సి.సి.ఆర్.టి సీనియర్ ఫెలోషిప్ ఇలా పలు పురస్కారాలను ఆయన అందుకున్నారు. పలు షోలలో తన కళలను కూడా ప్రదర్సన చేసారు.