కర్నాటక విశ్వవిద్యాలయం నుండి ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందిన కమల్ అహమద్ మలెకొప్ప, గదగ జిల్లాకు చెందిన విశిష్టమైన కళాకారుడిగా పేరు పొందిన వ్యక్తి. ఓ పక్క ఆర్ట్ టీచరుగా మరోపక్క కళాకారుడిగా బాధ్యతలను ఆయన నిర్వహిస్తున్నారు. తను రూపొందించే కూర్పులు వాస్తవంతో పాటు ప్రత్యేకమైన లోకాన్ని సృంజింపజేస్తాయి. ప్రాంతీయ జానపద రూపాల నుండి ప్రేరణ పొందిన అతని చిత్రాలు తన హస్తకళతో మరింత అందంగా కనిపిస్తాయి. గదగలో ఉన్న తన స్టూడియో ద్వారా బోధన చేస్తూ కళల కొత్త అవిష్కారం కోసం శ్రీకారం చుట్టారు. గుల్బర్గ మినీ విధాన సౌధలో జరిగే వార్షిక ప్రదర్శనలో బంగారు పథకాలు, గదగ్ కె. వి. పరిషత్ నుండి ప్రతిభా రత్న అవార్డు, హంపి కన్నడ విశ్వవిద్యాలయం నుండి ʼఉత్తమ సాంప్రదాయిక చిత్రంʼ అవార్డు, ఇలా పలు అవార్డులను అహ్మద్ అందుకున్నారు.