బెంగుళూరు చిత్రకలా పరిషత్తు నుండి ఫైన్ ఆర్ట్స్, పెయింట్‌గ్ లో పట్టా పొందిన ఊర్మిళా వేణుగోపాల్, శాంతినికేతన్ కలా భవన్ నుండి ప్రింట్ మేకింగ్‌లో మాస్టర్స్ చేసి ప్రస్తుతం బెంగుళూరులో కళాకారిణిగా సెటిల్ అయ్యారు. గత దశాబ్దంనుండి ఇంటాగ్లియొ ప్రింట్ మేకింగ్‌లో ఆమె కృషి చేసారు. భోపాల్, జర్మని, స్పేన్, గానా, శ్రీలంకా, జపాన్, పోలాండ్, టర్కి, స్విస్ దేశాల్లో క్రమంగా భారత్ భవన్ ఇంటర్ నేషనల్ బెనాల్ ఆఫ్ ప్రింట్ ఆర్ట్, లినో కట్ టుడే, గ్రాఫిక్ ఆర్ట్ ప్రైజ్ కాంపిటేషన్, అడోగి మిని ప్రింట్, వుడ్ కట్ ప్రింట్, తీర్థ రెడ్ డాట్ గేలరి, కివా అసోసియేషన్, స్ట్రీ విషన్, ట్రినెల్ ఆఫ్ మిని ప్రింట్స్ ఇలా పలు దేశాల కళా ప్రదర్శనలలో ఆమె పాల్గొన్నారు. వాసుదేవ్ స్కాలర్ షిప్, నేషనల్ లలిత కలా అకాడెమి స్కాలర్ షిప్, కర్నాటక లలితకలా అకాడెమి అవార్డులు, ఎఫ్.ఐ.సి.సి.ఐ, ఎఫ్.ఎల్. మహిళా సాధకుల అవార్డు ఇలా పలు పురస్కారాలు, అవార్డులను ఆమె అందుకున్నారు.