మనిషి, అతని చుట్టూ ఉండే ప్రకృతి నడుమ ఉండే సంబంధాన్ని పరిశోధన చేసే విధంగా కళని రూపు దిద్దడం అనిల్ ప్రత్యేకత. అతని మాటల్లో చెప్పాలంటే “నా కళలో ముఖ్యంగా డీల్ చేసే సంగతేంటంటే మనిషి మరియు ప్రకృతి మధ్యనున్న సంబంధాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం. మానవ శరీర నిర్మాణ శాస్త్రం ప్రకృతి, జ్యామితి, సాంకేతికతలను మమేకం చేసే చిత్రాలు నన్ను నేను అర్థం చేసుకోవడానికి, ప్రపంచానికి చాటడానికి సహకరిస్తాయి. వివిధ దృక్కోణాలలో జీవితాన్ని పరిశీలించఢం, మనిషికి – ప్రకృతికి నడుమ ఉండవలసిన సమతుల్యత ఇవి అతని చిత్రాలలో గమనించవలసిన విషయాలు.