వివేక్ శానభాగ్.
కన్నడ కథాలోకంలో వివేక్ శానభాగ్ మంచి కథకుడు. కథల్లో కొత్తదనం, చిన్న గ్రామమైనా, విశాల ప్రపంచమైనా అక్కడి మనుషుల మనసుని క్షుణ్ణంగా పరిశీలిస్తాయి శానభాగ్‌గారి కథలు. ఆయన వ్రాసిన ʼఘాచర్ ఘోచర్ʼ ఇంగ్లిష్ అనువాదం ప్రపంచంలో పలు పాఠకులని, సాహిత్య ప్రియులని ఆకట్టుకుంది. లండన్, అమేరికా దేశాల్లో అరుదైన ఆవృత్తిగా రూపుదిద్దుకున్న ఈ రచన ప్రపంచంలోని దాదాపు 18 భాషలకి అనువదించబడింది. లంగరు, హులి సవారి, మత్తొబ్బన సంసార ఇవి కథా సంపుటికలు. ఇన్నూ ఒందు, ఊరుభంగ, సకీనాళ ముత్తు ఇవి ప్రచురించబడ్డ నవలలు. బణ్ణద గొంబె, ఇల్లిరువుదు సుమ్మనె ఇవి నాటక రచనలు. ʼదేశకాలʼ ఇది ఆయన సంపాదకత్వం వహించిన పత్రిక.