సృజనాత్మక రచయిత మరియు ఉపాధ్యాయుడు వీరణ్ణ మడివాళర్ తన తొలి రచనకుగాను కేంద్ర సాహిత్య అకాడమి అందించే యువ పురస్కారం పొందిన తొలి కన్నడిగగా చరిత్ర సృష్టించారు. 2013లో ‘సాంగ్స్ ఆఫ్ సైలెన్స్’లో తన ప్రతిభను ప్రదర్శించి సాహిత్యమే కాకుండా ఫోటోగ్రఫి, సినీరంగంలో ఉన్న తమ మక్కువని తెలిపారు. ‘నెలద కరుణెయ దని’, ‘ఎల్లో హళాగి హోగిద్దానె వసంత’, ‘వీరణ్ణ మడివాళర ఖండ కావ్య’, ‘నగర నుంగిద నవిలు’ ఆయన రచనలు. సాహిత్యం మరియు విద్యారంగాలకు అందించిన విశిష్టమైన సేవలకుగాను ʼబెంద్రె గ్రంథ బహుమానʼ మరియు ʼఇంచల కావ్య ప్రశస్తితో సహా పలు సత్కారాలను ఆయన పొందారు.