ఉణుదుర్తి సుధాకర్ (1954) స్వస్థలం విశాఖపట్నం. వృత్తిరీత్యా వాణిజ్య నౌకలలో మెరైన్ ఇంజినీరు. ‘తూరుపు గాలులు’ (2018), ‘చలిచీమల కవాతు’ (2021) పాఠకుల మన్ననలను, విమర్శకుల గుర్తింపును పొందాయి. చారిత్రక పరిశోధక రచన ‘తథాగతుని అడుగుజాడలు’కి సహ రచయిత (2019). సుధాకర్ రచించిన నవలలు రెండూ (‘యారాడ కొండ,’ ‘చెదరిన పాదముద్రలు’) 2020, 2024 సంవత్సరాలకు గాను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) బహుమతిని పొందాయి. నేడు తెలుగులో చరిత్ర ఆధారంగా రచనలు చేస్తున్న వారిలో సుధాకర్ ఒకరు. వీరి కథల ఇంగ్లీషు అనువాదం ‘ఈస్ట్ విండ్,’ 2023లో వెలువడింది.