రచయిత, అనువాదకుడు సుభాష్ రాజమానె కర్నాటకలోని బెళగావి జిల్లా అథణి ప్రాంతపు కుసనాళ గ్రామానికి చెందినవారు. బెంగుళూరు యూనివర్సిటీనుండి బి.ఎ, మైసూరు యూనివర్సిటీనుండి ఎం.ఎ, మంగళూరు యూనివర్సిటీ నుండి బి.ఎడ్, హంపి కన్నడ యూనివర్సిటీనుండి పిహెచ్డి పట్టా పొంది ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలో కన్నడ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
ʼది ఆర్టిస్ట్ʼ(మైకెల్ హజన్ విసియస్), ʼబదుకిన అర్థవన్ను హుడుకుత్తాʼ(విక్టర్ ఫ్రాంక్స్), ʼముళుగదిరలి బదుకుʼ(ఎపిక్టేటస్), ʼరాత్రిగె సావిర కణ్ణుగళుʼ(అలెస్సండ్రొ బారికొ) ʼబుద్ధప్జ్ఞెయ నడిగెʼ(తిచ్ న్హాత్ హాన్) ఇవి సుభాష్ చేసిన అనువాదాలు.
ʼనిర్దిగంతవాగి ఏరి: కన్నడ కాదంబరి విమర్శెయ విమర్శెʼ ఇది ప్రొ.రహమత్ తరీకెరె గైడెన్స్‌లో ఆయన చేసిన పి.హెచ్డి పరిశోధన. ʼబహుత్వ కథనʼ మరో రచన. 2022 లో కాంతావర సాహిత్య విమర్శ పురస్కారాన్ని సుభాష్ అందుకున్నారు.