ʼబళపʼ అనే కన్నడ బాలల పత్రికకు ఎడిటరుగా గుర్తించబడే శివలింగప్ప హందిహాళ్, కవి, బాలసాహిత్య రచయిత, అనువాదకుడు, ఉపాధ్యాయుడు కూడా. ʼకనకదాసు పరిశోధనా సంస్థʼ చేసిన తత్వపదాల సంపుటికోసం ఆయన బళ్లారి ప్రాంతంలో క్షేత్ర నిపుణుడిగా పనిచేశారు. ‘నాను మత్తు కన్నడక’, ‘ఎళెబిసిలు’, ‘షావోలిన్’, ‘ఆనందావలోకన’, ‘బళ్లారి బెడగు’, ‘ది యంగ్ సైంటిస్ట్’ ఆయన ప్రముఖ రచనలు. శ్రీకృష్ణదేవరాయల వారసులు అందించే ʼసాహితీ సిరి అవార్డుʼ, ʼనల్నుడి కథా పురస్కారం, ʼఅష్ట దిగ్గజ అవార్డుʼ లను ఆయన అందుకున్నారు.