ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ పొందిన గంగాధరయ్య కన్నడ సాహిత్య రంగంలో అనేక ముఖ్యమైన రచనలను ప్రచురించారు. ‘నవిల నెలʼ ‘ఒందు ఉద్దనెయ నెరళు’ ఆయన కథా సంకలనాలు. అతను వైకం కథలు, లోర్కా నాటకం, డార్యోఫో నాటకం మరియు చింగిజ్ ఐత్మాటోవ్ నవల ʼజమీలాʼను కన్నడలోకి అనువదించారు. కువెంపు బాషాభారతి ప్రచురించిన ‘ఆఫ్రికన్ సాహిత్య వాచికె’ వ్యాసాలను, డాక్టర్ రామమనోహర లోహియా, జగజీవనరామ్‌ల సమగ్ర రచనలను కూడా అనువదించారు. 1996లో ‘వైకం కథెగళుʼరచనకు కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.