ఎస్.జి.వాసుదేవ్
అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సినీ కళాకారులలో ఒకరైన ఎస్.జి.వాసుదేవ్ మద్రాస్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌లో కళలను అభ్యసించి, నాలుగు దశాబ్దాలకు పైగా కళారంగంలో కృషి చేస్తున్నారు. వృక్ష, మిథున, హ్యూ-షీ ఇవి ఆయన చిత్రాలు. 1965-66 లో మొదలైన ʼచోళమండలం కళాకారుల గ్రామాʼ న్ని స్థాపించిన వారిలో వాసుదేవ్ ఒకరు. కె.ఎస్. ఫణిక్కర్ అవార్డుతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన అందుకున్నారు. ‘ది ఓపెన్ ఫ్రేమ్’ అతని కళ ఆధారంగా రూపొందించబడిన డాక్యుమెంటరిగా గుర్తించబడింది.