స్త్రీవాద రచయిత ప్రొ. ఆర్ సునందమ్మ కథ, నవల, విమర్శ, పరిశోధన పద్ధతుల్లో తమదైన తీరులో పేరు పొందిన కన్నడ ప్రొఫెసర్.
2003 లో కర్నాటక రాష్ట్ర మహిళా యూనివర్సిటీలో అధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆవిడ ఉపాధ్యాయినిగా, ప్రొఫెసర్‌గా, రీడర్‌గా, మహిళా అధ్యయన కేంద్ర ముఖ్యస్థురాలిగా, కనకదాస అధ్యయన పీఠానికి కోఆర్డినేటర్‌గా, ఆర్థిక అధికారిగా, మహిళా యూనివర్సిటీలో మొదటి మహిళా చాన్సలర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందబోతున్నారు.
బోధన, ఇతర కార్యకలాపాలు మాత్రమే కాకుండా పరిశోధన రంగంలో కృషి చేసిన ఆమె రాష్ట్ర ప్రభుత్వం, యుజిసి ద్వారా మొత్తం పదకొండు పరిశోధన ప్రణాళికలను పూర్తి చేసి రిపోర్ట్ అందించారు. మహిళా యూనివర్సిటీలో మొత్తం పదహారు విద్యార్థులకు పి.హెచ్డి గైడ్ చేసారు.
2001 లో ఆమె వ్రాసిన ʼపరివర్తనెʼ కథకుగాను ఎచ్. ఎం.టి అవార్డు, 2005 లో ʼద్విత్వʼ నవలకు కర్నాటక సాహిత్య అకాడెమి ప్రశస్తి, 2012 లో ఇందిరా గాంది విశిష్ట సేవా ప్రశస్తి, 2017 లో సువర్ణ ముఖి ప్రశస్తి, 2015 లో దలిత సాహిత్య పరిషత్ అందించే ʼసావిత్రి బాయి పులెʼ అవార్డుతో సహ పలు పురస్కారాలను ఆమె అందుకున్నారు.