Choose Language:

Prathibha Nandakumar

ప్రతిభా నందకుమార్‌

కన్నడ రచయిత్రి ప్రతిభా నందకుమార్‌ మద్రాస్‌ యూనివర్సిటీనుండి ఎం.ఎ,ఎం.ఫిల్‌ పట్టా పొందారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, డెక్కన్‌ హెరాల్డ్‌, అగ్ని పత్రికలకు జర్నలిస్ట్‌గా పని చేసిన ఆమె మహిళా కవిత్వాన్ని పెంపొందించినవారిలో ప్రముఖులు. ʼనావు హుడుగియరే హీగెʼ, ʼఈ తనకʼ, ʼరస్తెయంచిన గాడిʼ, ʼకవడెయాటʼ, ʼఆహా పురుషాకారంʼ, ʼమున్నుడి బెన్నుడిగళ నడువెʼ, ʼకాఫీ హౌస్‌ʼ, ʼముదుకియరిగిదు కాలవల్లʼ, ఇవి ఆమె రచించిన కవితా సంకలనాలు. ʼయానʼ, ʼఆక్రమణʼ, ʼసూర్యకాంతిʼ ఇతర రచనలు. ʼఅనుదినద అంతరగంగెʼ(స్వీయ చరిత్ర). సాహిత్య కృషికిగాను ʼమహాదేవి వర్మ కావ్య సమ్మానʼ, ʼకర్నాటక సాహిత్య అకాడెమి బహుమతిʼ, ʼడా.శివరామకారంతʼ అవార్డు, ʼపు.తి.న కావ్యʼ అవార్డులను ఆమె అందుకున్నారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo