ఇప్పటి తరం సృజనాత్మక రచయిత్రి పూర్ణిమా మాళగిమనె చిత్రదుర్గలోని S.J.M.I.T నుండి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ కోర్సులో పట్టా పొందారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆరేళ్లపాటు అధికారిగా పనిచేసిన పూర్ణిమ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాయింట్ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆమె ‘ఎనీవన్ బట్ ది స్పౌస్’ అనే ఇంగ్లిష్ చిన్న కథల సంకలనంతో పాటు అనేక రచనలను రచించారు. ‘ఆగమ్య, ‘ప్రీతి ప్రేమ పుస్తకదాచెయ బదనేకాయిʼ ఇవి నవలలు. ‘డూడుల్ కథెగళు, ‘లవ్ టుడే ఇవి చిన్న కథలు. ఆమె వ్రాసిన అనేక సాంకేతిక మరియు సాహిత్య వ్యాసాలు వివిధ కన్నడ వార్తాపత్రికలు మరియు ఆన్‌లైన్ జర్నల్స్‌లో ప్రచురించబడ్డాయి. ఆమె కథ ‘విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ʼ బుక్ బ్రహ్మ స్వాతంత్ర కథల పోటీలో మొదటి బహుమతి పొందింది