ప్రముఖ మలెయాళం రచయిత పాల్ జకారియ గత ఆరు దశాబ్దాలుగా సాహిత్యం, జర్నలిసం రంగాలలో కృషి చేసారు. 1969 లో ʼకున్నుʼ అనే చిన్న కథా సంకలనంతో పరిచయమైన ఆయన ఇప్పటిదాకా 17 కథా సంకలనాలను ప్రచురించారు. ʼభాస్కర పట్టెలారం ఎంతె జీవితంʼ నుండి ʼజాచహారియావొడె నొవెళ్ళక్కలలʼ వరకు మొత్తం పది నవలలు ఆయన ప్రచురించారు. పర్యటనలో ఆసక్తితో ఆరు ప్రయాణ కథనాలను వ్రాసారు. వ్యాసరచయితగా, పిల్లల పుస్తక రచయితగా, అనువాదకునిగా, స్క్రీన్ ప్లే రచయితగా ప్రపంచ సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. అతని వందల కొద్దీ ఆంగ్ల రచనలు భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రచురణలలో కనిపిస్తాయి. ఆయన ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA), ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI), ఇండియా టుడే (మలయాళం) మరియు ఆసియానెట్‌లతో కలిసి పనిచేశారు. అతను ‘కేంద్ర సాహిత్య అకాడమీ’ అవార్డు, ‘కేరళ సాహిత్య అకాడమీ’ అవార్డు, కేరళ ప్రభుత్వ అత్యున్నత సాహిత్య పురస్కారం, ‘ఎజుతచ్చన్ʼ పురస్కారాలను ఆయన అందుకున్నారు.