డిజిటల్ ఆర్కైవిస్ట్, పారిశ్రామికవేత్త ఓం శివ ప్రకాశ్ కన్నడ భాషకు సంబంధించి టెక్నాలజీని అభివృద్ధి చేయడం, వచన సాహిత్యం అలాగే కన్నడ పుస్తకాలను డిజిటజలైజ్ చేయడం, రంగ గేయాలు, నాటికలను డిజిటర్ ఫార్మ్ గా మార్చడంలో కృషి చేస్తున్నారు.
ఆయన #ServantsOfKnowledge సంస్థకు సహ-సంస్థాపకులు కూడా. ఈ సంస్థ ఇండియాలో ఉన్న పుస్తకాలు, హస్త ప్రతులు, పత్రికలను డిజిటలైస్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ భారతీయ సాహిత్యాన్ని సంరక్షించే ప్రయత్నంలో ఉంది.
టెక్నాలజీ ద్వారా కన్నడ సాహిత్య పరిశోధనని పెంపొందించే దశలో కృషి చేస్తూ సంచయ (https://sanchaya.org), కన్నడ చరిత్ర, సంస్కృతి, కళలను పెంపొందించేందుకుగాను సాంచి ఫౌండేశన్ (https://sanchifoundation.org)లను స్థాపించారు. వీటిలో భాగంగా వచన సంచయ, దాస సంచయ, జన్న సంచయ అనే సిరీస్‌లు ఉన్నాయి.