ఎన్.ఎస్. శ్రీధరమూర్తి
ఎన్.ఎస్. శ్రీధరమూర్తిగారు కర్నాటకలో జర్నలిస్ట్, కాలమిస్ట్, రచయితగా పరిచితం. మంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో పట్టా పొంది ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ‘మల్లిగె’ మాసపత్రిక ద్వారా జర్నలిజంలోకి ప్రవేశించి గత రెండు దశాబ్దాలుగా కల్చరల్ జర్నలిజంలో కృషి చేస్తున్నారు. ‘సింహావలోకన’, ‘నగువ నయన మధుర మౌన’, ‘మంజుళ ఎంబ ఎందెందూ మరెయద హాడు’, ‘సాహిత్య సంవాద’, ‘హడు ముగియువుదిల్ల’, ‘సినిమా ఎన్నువ నాళె’ ఆయన ప్రధాన రచనలు. ‘కన్నడ సినిమా హాడుగళ సాంస్కృతిక అధ్యయన’ ఇది ఆయన పరిశోధన. సాహిత్యం మరియు సాంస్కృతిక రంగాలలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీధరమూర్తి, ఆర్.ఎన్.ఆర్ పురస్కారం మరియు సువర్ణ కర్ణాటక పురస్కారంతో సహా అనేక సత్కారాలు మరియు పురస్కారాలు అందుకున్నారు.