కన్నడ కవి, రచయిత మూడ్నాకూడు చిన్నస్వామి, దళిత సాహిత్యానికి సంబంధించి 38 కి పైగా రచనలు ప్రచురించారు. సంస్కృతి, సమాజ సేవ, రంగ నటుడిగా గుర్తించబడ్డ ఆయన మూడు తరాలకు సాక్షిగా ఉన్న వ్యక్తి. ʼమత్తె మళె బరువ మున్నʼ, ʼనానొందు మరవాగిద్దరెʼ, ʼచప్పలి మత్తు నానుʼ, ʼబుద్ధ బెళదింగళుʼ ఇవి కవితా సంకలనాలు. ʼమోహదీపʼ, ʼపాపప్రజ్ఞెʼ ఇవి కథలు. ʼకెండ మండలʼ, ʼబహురూపిʼ ఇవి నాటకాలు. ʼఒందు కొడ హాలిన సమరʼ, ʼఅపరిమిత కత్తలెʼ, ʼబహుత్వద భారతʼ, ʼబౌద్ధ తాత్వికతెʼ ఇవి ఆయన వ్రాసిన ప్రముఖ రచనలు.