రంగస్థల దర్శకుడు మరియు రంగస్థల నటుడు అయిన మౌనేశ్ బడిగేర్ కథకులు కూడా. కన్నడ నాటకరంగంలో చురుగ్గా ఉన్న మౌనేష్ తన కథా సంకలనం ‘మాయ కోలాహలʼ కుగాను 2015 లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం, టోటో అవార్డు, డా.యు.ఆర్. అనంతమూర్తి పురస్కారం మరియు బసవరాజ కట్టిమని పురస్కారాలను పొందారు. అతను ప్రచురించిన నాటకాలలో ‘విశంకె – విధ్వంసక శాంతి కేంద్ర’ మరియు ‘తపలుమణి’ (రవీంద్రనాథ్ ఠాగూర్ నాటకం డాక్-గర్ యొక్క అనుసరణ) ఉన్నాయి. నీనాసం నిర్మించిన ‘కన్నడ కావ్య కన్నడి’లో కువెంపు, చంద్రశేఖర కంబార్‌ల కవితలను దృశ్య కావ్యంగా, వివేకా శానభాగ్ రచన ఆధారంగా రూపొందించిన ‘నిర్వాణ’ లఘుచిత్రాలకు, 2019లో దేశవ్యాప్తంగా విడుదలైన ‘సూజిదార’ అనే కన్నడ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ʼప్రేమవెంబ అవర్గీయ వ్యంజనʼ ఇది ఇటీవల విడుదలైన ఆయన ప్రేమ కవితల సంకలనం