కర్నాటకలోని చిక్క మగళూరు ప్రాంతానికి చెందిన ఎం.ఆర్.దత్తాత్రిగారు నవలా రచన, అనువాదం, వ్యాసకర్తగా గుర్తింపు పొందారు. మైసూరు యూనివర్సిటీనుండి కంప్యూటర్ సైన్స్‌లో పట్టా పొందిన ఆయన కెజిఎఫ్, పుణె, స్యాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలీస్ నగరాల్లో వృత్తి జీవితం తర్వాత ప్రస్తుతం బెంగుళూరులో స్థిరపడ్డారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విజయాలను చవి చూసిన ఆయన ఇఆర్‌పి క్లౌడ్ టెక్నాలజి క్షేత్రంలో రిసోర్స్ పర్సన్‌గా పలు మల్టి నేషనల్ కంపెనీలతో పని చేసారు. అమేరికా అలాగే ఇండియాలోని పలు కంపెనీలకు టెక్నాలజి, ప్రాజక్ట్ మేనేజ్‌మెంట్ అడ్వైసర్‌గా సేవ అందించిన ఆయన సాహిత్యం, ఫిలాసఫి విషయాలలో ఆసక్తి పెంచుకున్నారు.
ʼఅలెమారి కనసుగళుʼ ఇది దత్తాత్రి ప్రచురించిన మొదటి రచన. తర్వాత, ʼపూర్వ – పశ్చిమʼ, ʼద్వీపవ బయసిʼ, ʼతారాబాయి పత్రʼ, ʼఒందొందు తలెగూ ఒందొందు బెలెʼ ఇలా పలు రచనలను ఆయన ప్రచురించారు.
సాహిత్య రంగంలోని తన సేవకుగాను డా. హ.మా.నాయక అవార్డు, సూర్యనారాయణ చడగ అవార్డు, సేడం అమ్మ ప్రశస్తి, డా. నరహళ్ళి అవార్డు, మాస్తి నవలా పురస్కారాలను ఆయన అందుకున్నారు.