భరతనాట్యంలో విద్వత్ పొందిన స్త్రీవాద రచయిత ఎ.ఎల్. జి. మీరా కర్నాటకలోని కొడగు ప్రాంతానికి చెందినవారు. కన్నడ సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ పొంది ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమె పేద పిల్లలకు ఉచితంగా భరతనాట్యం బోధిస్తారు.
ʼతమిళు కావ్య మీమాంసెʼ, మానుషియ మాతుʼ, ʼబహుముఖʼ, ʼస్త్రీ సంవేదనెయల్లి కన్నడ కథనʼ, ʼకన్నడ మహిళా సాహిత్య చరిత్రెʼ, ʼఆకాశ మల్లిగె ఘమఘమʼ, ʼకెంపు బలూను ఇతర శిశు గీతెగళుʼ, ఇవి ఆమె రచనలు.
సాహిత్యం, సాంస్కృతిక రంగాలకు ఆవిడ అందించిన సేవకుగాను ʼకర్నాటక సాహిత్య అకాడెమి బహుమతిʼ, ʼగుడిబండె పూర్ణిమా దత్తి బహుమతిʼ, ʼపాటీల పుట్టప్ప కథా ప్రశస్తిʼ, ʼకర్నాటక బాల వికాస అకాడెమి బహుమతిʼ, ʼసంక్రమణ కావ్య బహుమతిʼ, ʼకలేసం గుణసాగరి నాగరాజు దత్తి బహుమతిʼ పలు పురస్కారాలను ఆమె అందుకున్నారు.