ఎనభైవ దశాబ్దంలో కన్నడ కథాలోకానికి పరిచయమైన కేశవ మళగి తన విభిన్నకథనంతో పాఠకులని ఆకట్టుకున్నారు. ʼకడల తెరెగె దండెʼ, ʼఅకథ కథాʼ ʼమాగి మూవత్తైదుʼ, ʼవెన్నెల దొరెసానిʼ, ʼహొళె బదియ బెళగుʼ కథా సంకలనాలు. ʼకుంకుమ భూమిʼ, ʼఅంగద ధరెʼ ఇవి నవలలు. ʼనేరళె మరʼ రూపక కథనం. ʼనీలి కడల హక్కిʼ కథలు, ʼబోరిస్ పాస్తర్‌నాక్:వాచికెʼ, ʼమదనోత్సవʼ నవల, ʼసంకథనʼ, ʼబ్యూటి ఆఫ్ ద శోర్ʼ ఫ్రెంచ్ కథలు, ఇవి అనువాదాలు. అంతే కాకుండా ఇతర భాషలనుండి కవిత్వాలను కన్నడ బాషలోకి ఆయన అనువాదించారు.