కన్నడ సాహిత్య లోకంలో కె.వై.ఎన్ పేరుతో చిరపరిచితమైన కుప్పూరు ఎల్లప్ప నారాయణస్వామి కన్నడ రంగభూమిలో గుర్తింపు పొందిన ప్రముఖుల్లో ఒకరు. ʼకళవుʼ, ʼఅనభిజ్ఞ శాకుంతలʼ, ʼచక్రరత్నʼ, ʼహులిసీరెʼ, ʼవినురవేమʼ ఇవి ఆయన వ్రాసిన కన్నడ నాటకాలు. కన్నడ రచయిత కువెంపు వ్రాసిన ʼశూద్ర తపస్విʼ నాటకాన్ని ఆయన తెలుగులోకి అనువాదించారు. అంతే కాకుండా కువెంపుగారి ʼమలెగళల్లి మదుమగళుʼ అనే కన్నడ నవలను తొమ్మిది గంటల రంగ నాటకకంగా మలిచారు. ఇండియన్ థియేటర్‌లో రికార్డు సృష్టించిన మొదటి ప్రయత్నం ఇది. ఆయన ʼకళవుʼ, ʼసూర్యకాంతిʼ, అనే సినిమాలకు స్క్రీన్ ప్లే వ్రాసారు. తన ʼపంప భారతʼ, ʼనెనెవ పరిʼ నాటకాలకుగాను కర్నాటక సాహిత్య అకాడెమి అవార్డులను ఆయన పొందారు