కర్నాటకలో జర్నలిస్ట్‌గా, రచయితగా గుర్తించబడే కె. పుట్టస్వామి, బెంగుళూరు అగ్రికల్చర్ యూనివర్సిటీనుండి అగ్రి కల్చర్ డిగ్రీ, మైసూరు యూనివర్సిటీనుండి జర్నలిసంలో డిప్లోమా, హంపి కన్నడ యూనివర్సిటీ నుండి డి.లిట్ పట్టా పొందారు. జర్నలిస్ట్‌గా తన కెరియర్‌ని మొదలు పెట్టిన పుట్టస్వామి కర్నాటక ప్రభుత్వపు పలు శాఖల్లో సేవలందించారు. ʼజీవ సంకులగళ ఉగమʼ, ʼజీవజాలʼ, ʼసినిమాయానʼ, ఇవి ఆయన ప్రముఖ రచనలు. ʼమణి భూమిక్ʼ, ʼసహస్రబుద్ధెʼ, ʼభీరేంద్ర భట్టాచార్యʼ, ʼహెచ్ జి. వేల్స్ ఇవి అనువాదాలు. ఆయన తన సాహిత్య, సినీ రంగానికి అందించిన సేవలకుగాను కర్నాటక సాహిత్య అకాడెమి అవార్డు, కర్నాటక రాష్ట్ర పర్యావరణ అవార్డు, ʼస్వర్ణ కమలʼ అవార్డులను అందుకున్నారు.