జయంత్ కాయ్కిణి
కన్నడ సాహిత్యంలో కవి-కథకుడుగా పేరుగాంచిన జయంత్ కాయ్కిణి కొంతకాలం ముంబైలో ఒక ఫార్మా కంపెనీలో పని చేసేవారు. ఆ తర్వాత ʼభావనాʼ పత్రిక సంపాదకుడిగా, ఎలెక్ట్రానిక్ మీడియా ఉద్యోగిగా సేవలందించారు. మనసుని హద్దుకొనే ఆయన కవితలు కన్నడ చిత్రరంగంలో సినీ గీతాలుగా సూపర్ హిట్ అయ్యాయి. నాటకాల అనువాదంతోపాటు వ్యాసాలు కూడా వ్రాసారు. ʼతెరెదష్టే బాగిలుʼ, ʼదగడూ పరబన అశ్వమేధʼ, ʼఅమృతబళ్ళి కషాయʼ, ʼతూఫాన్ మేల్ʼ ఇవి కథా సంపుటికలు. ʼరంగదిందొందష్టు దూరʼ, ʼకోటితీర్థʼ, ʼశ్రావణ మధ్యాహ్నʼ, ʼనీలి మళెʼ, కవితా సంకలనాలు. కాయ్కిణిగారు అనువదించిన కథల ʼనో ప్రసెంట్ ప్లీస్ʼ సంకలనానికిగాను 2018 లో సౌత్ ఏష్యా ʼడిఎస్‌సి సాహిత్య పురస్కారంʼ లభించింది. నాలుగు సార్లు కర్నాటక అకాడెమి సాహిత్య పురస్కారం, కుసుమాగ్రజ పురస్కారం, జాతీయ కథా పురస్కారాలు కూడా లభించాయి.