హెచ్. ఎస్. శివప్రకాశ్
కర్నాటకకు చెందిన కవి, నాటకకర్త అయిన హచ్.ఎస్. శివప్రకాశ్‌గారు భారతీయ రచయితల్లో ప్రముఖులుగా గుర్తించబడ్డారు. న్యూ ఢిల్లీ జె.ఎన్.యు యూనివర్సిటీలో సౌందర్య శాస్త్రం బోధించేవారు. కావ్యం, నాటకం, అనువాదం ఇలా సాహిత్యపు పలు రకాల్లో కృషి చేసారు. మహాచైత్ర, సుల్తాన్ టిప్పు, మంటేస్వామి, మాదరి మాదయ్య, మదువె హెణ్ణు ఇవి నాటక రచనలు. మళె బిద్ద నెలదల్లి, మిలరేప, అణుక్షణ చరితె, సూర్యజల, మళెయే మంటప ఇవి ఆయన రచించిన కవితా సంకలనాలు. శివప్రకాశ్ గారి రచనలు ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్, జర్మన్, పోలిష్, హింది, మలయాళం, మరాఠి, తమిళు, తెలుగు బాషలకు అనువదించబడ్డాయి. హెచ్.ఎస్. శివప్రకాశ్ గారికి కేంద్ర సాహిత్య అకాడెమి గౌరవం, కేంద్ర సంగీత నాటక అకాడెమి అవార్డు, కర్నాటక సాహిత్య అకాడెమి గౌరవం, నాలుగు రచనలకుగాను కర్నాటక సాహిత్య అకాడెమినుండి బహుమతి, కువెంపు భాషా భారతి అవార్డులు లభించాయి.