కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, పెర్నె అనే గ్రామానికి చెందిన ఫాతిమా రలియా కన్నడ సాహిత్యంలో ప్రముఖ రచయిత్రిగా పేరు పొందారు. ʼసుధాʼ ʼసమాజముఖిʼ పత్రికల కథల పోటీలలో మొదటి బహుమతి అందుకున్నారు. ʼకడలు నోడలు హొరటవళుʼ రచనకుగాను ʼఅవ్వ ప్రశస్తిʼ అవార్డును ఆమె అందుకున్నారు. ʼఒడెయలారద ఒడపుʼ ఆమె ఇటీవల రచించిన కథా సంకలనం. ʼబేంద్రె సాహిత్యʼ అవార్డు, ʼలంకేశ్ ప్రశస్తిʼ అవార్డులను కూడా ఆమె అందుకున్నారు.