ఇ.వి. రామకృష్ణన్ ఇంగ్లిష్ మరియు మలయాళంలో కవిత్వం, విమర్శలను ప్రచురించిన ద్విభాషా రచయిత. ʼబీయింగ్ ఎల్స్‌వేర్ ఇన్ మైసెల్ఫ్ (1980)ʼ, ʼఎ పైథాన్ ఇన్ ఎ స్నేక్ పార్క్ (1994)ʼ, ʼటర్మ్స్ ఆఫ్ సీయింగ్: న్యూ అండ్ సెలెక్టెడ్ పోయెమ్స్ (2008)ʼ ఇవి ఆయన రచనలు. ఆధునిక భారతీయ కవిత్వాల అనువాదాల్లో ముఖ్యమైనదిగా గుర్తించబడే ʼThe Tree of Tonguesʼ వ్రాసింది ఆయనే.