ధనంజయ కుంబ్ళె
కన్నడ కవి, విమర్శకులు, ధనంజయ కుంబ్ళె ప్రస్తుతం మంగళూరు యూనివర్సిటీలో కన్నడ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. 1998లో అతని మొదటి కవితా సంపుటి ‘మొదల పాప’ ప్రచురితమైంది. ʼనాను మత్తు ఆకాశ’ – విమర్శ వ్యాసాలు, ‘హడు కలిత హక్కిగె’ – కవితా సంకలనం, ‘కజంపాడి రామ’, ‘ప్రగతిశీల లేఖక నిరంజన’ ఇతర రచనలు. మంగళూరు విశ్వవిద్యాలయం యక్షగాన అధ్యయన కేంద్రానికి సమన్వయకర్తగా పనిచేసిన ఆయన ఇప్పుడు కనకదాస పరిశోధనా కేంద్రానికి సమన్వయకర్తగా, ప్రసార సహాయ సంచాలకులుగా కూడా పనిచేస్తున్నారు. సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ఆయన చేసిన కృషికి గాను ‘పేజావర సదాశివరావు రాష్ట్ర స్థాయి అవార్డు’, ‘కాంతావర కన్నడ సంఘంʼ అందించే ʼముద్దణ కావ్య అవార్డు’, ‘సాహిత్య యువ సాధక పురస్కారం’, ʼమయూరవర్మ అవార్డుʼ ఇంకా అనేక పురస్కారాలను ఆయన అందుకున్నారు.