సంగీత కుటుంబానికి చెందిన బాగెశ్రీ సుబ్బణ్ణ జర్నలిస్ట్‌గా, అనువాదకురాలిగా పని చేస్తున్నారు. రెండున్నర దశాబ్దాలుగా జర్నలిసంలో ఉన్న ఆమె జర్నలిసం మరియు సంస్కృతుల నడుమ వారధిగా కృషి చేసారు. ఇరవైయ్యేళ్ళపాటు ʼది హిందుʼ పత్రికలో పని చేసిన ఆమె కళ, సంస్కృతి, సాహిత్య విభాగాల్లో పని చేసారు. ఆమె ప్రస్తుతం ʼది హిందుʼ కోసం బెంగుళూరు బ్యూరోలో ఉన్నారు. ఇంతకు ముందు డెక్కన్ హెరాల్డ్‌లో కూడా ఉండేవారు. సాహిత్యం పట్ల మక్కువ కలిగిన ఆమె మంచి రీడర్ కూడా.