Choose Language:

B Jeyamohan

బి. జయమోహన్‌ మలెయాళం, తమిళు భాషల మీద పట్టున్న రచయిత, విమర్శకుడు. ఈ రెండు బాషల సినీ పరిశ్రమలో స్క్రిప్ట్‌, ఫిక్షన్‌ రైటర్‌గా పేరు పొందిన వ్యక్తి ఈయన. గాంధి తత్వం, పర్యావరణం పట్ల ప్రేమ ఉన్న జయమోహన్, ʼరబ్బరుʼ, ʼకాడుʼ, ʼవిష్ణుపురంʼ ఇలా పలు నవలలు వ్రాసారు. జయమోహన్‌ రచించిన మహాభారతానికి పునర్విమర్శగా చెప్పబడే ʼవెన్మురసుʼ ప్రపంచంలోనే అతిపెద్ద నవలగా పేరు పొందింది. తన సాహిత్య కృషికిగాను ʼఅఖిలన్‌ మెమోరియల్‌ ప్రైజ్‌ʼ, కన్నన్‌ దాసన్‌ అవార్డుʼ, 2013 లో సింగపూర్‌ నేషనల్‌ లైబ్రరినుండి ʼTamil Author of Yearʼ అవార్డు ఇలా పలు గౌరవాలను ఆయన అందుకున్నారు. 2016 లో భారత ప్రభుత్వం అందించిన పద్మశ్రీ అవార్డు స్వీకరించడానికి ఆయన నిరాకరించారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo