కన్నడ రంగభూమి, సినీ పరిశ్రమలో నటిగా, గాయనిగా పేరు పొందిన బి.జయశ్రీ కన్నడ రంగ నటుడు గుబ్బి వీరణ్ణగారి మనవరాలు. తన నాలుగేళ్ళ వయసప్పుడు రంగప్రవేశం చేసిన ఆమె తన నటన ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందిన నటి. ప్రతిష్టాత్మకమైన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి పట్టభద్రురాలైన ఆమె థియేటర్, సినీ రంగం రెండింటిలోనూ పనిచేస్తున్న సీనియర్ ఆర్టిస్టులలో ఒకరు. అంతే కాకుండా ఆమె ప్రసిద్ధ గాయని కూడా. ఆమె సాధించిన విజయాలకు గుర్తింపుగా కర్ణాటక ప్రభుత్వం 2010లో ఆమెను రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నుకుంది. రంగాయణ అధినేత్రిగా పనిచేసిన జయశ్రీని కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.