ఆనంద ఋగ్వేది కథా రచన, విమర్శ, కవిత్వం, పరిశోధన, నాటక రంగాల్లో కృషి చేసారు. సైన్స్ పట్టా పొంది కన్నడ సాహిత్యంలో పోస్ట్ గ్యాడ్యుయేషన్ పొంది, హంపి కన్నడ యూనివర్సిటీ నుండి పి.ఎచ్.డి పుచ్చుకున్నారు. ఆయన ప్రస్తుతం దావణగెరె జిల్లా ఆసుపత్రిలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తున్నారు. ʼజన్న మత్తు అనూహ్య సాధ్యతెʼ, ʼమగదొమ్మె నక్క బుద్ధʼ, ʼకరకీయ కుడిʼ, ఇవి కథా సంపుటికలు. ʼతథాగతనిగొందు పద్మపత్రʼ, కవితా సంకలనాలు. ʼతళమళద హాది పూర్వోత్తరʼ, ʼకుణణిదు కాడువ గాళిʼ విమర్శలు. ʼకర్నాటక సాహిత్య అకాడెమి పుస్తక బహుమతిʼ, ʼకడెంగోట్లు కావ్య ప్రశస్తిʼ, ʼడా. పాటీల్ పుట్టప్ప కథా పురస్కారంలాంటి పలు గౌరవాలను ఆయన అందుకున్నారు.