మైసూరు యూనివర్సిటీనుండి ఇంగ్లిష్ సాహిత్యంలో ఎం.ఎ పట్టా పొందిన అబ్దుల్ రషీద్, మైసూరు ఆకాశవాణిలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా, ʼకెండ సంపిగెʼ పేరుగల ఆన్‌లైన్ కన్నడ పత్రికకు సంపాదకునిగా పని చేస్తున్నారు. కర్నాటకలో కథకుడిగా, కవిగా, కాలమిస్ట్‌గా పేరు పొందిన ఆయన ʼహాలు కుడిద హుడుగʼ, ʼప్రాణపక్షిʼ అనే కథా సంకలనాలు, ʼనన్న పాడిగె నానుʼ, ʼనరక కెన్నాలిగెయంత నిన్న బెన్నహురిʼ అనే కవన సంకలనాలను ప్రచురించారు. అంతే కాకుండా ʼమాతిగూ ఆచెʼ, ʼఅలెమారియ దినచరిʼ, ʼకాలు చక్రʼ అనే వ్యాస రచనలు, ʼహూవిన కొళ్ళిʼ పేరుగల నవలను ప్రచురించారు. సాహిత్యం మాత్రమే కాకుండా శిల్లాంగ్ రేడియో, ఇంగ్లెండ్‌లోని థామ్రిన్ ఫౌండేశన్ కోసం ఐర్లెండ్‌లో రేడియో డాక్యుమెంటరీని ప్రొడ్యూస్ చేసారు. లంకేశ్ పత్రిక కోసం ʼశిలాంగ్ నింద పత్రʼ, విజయ కర్నాటక పత్రిక కోసం ʼకాలు చక్రʼ అనే కాలమ్‌లను ఆయన వ్రాసారు. కన్నడ సాహిత్యంలో తన విభిన్న రచనలతో రషీద్ గుర్తింపు పొందారు.