సంస్కృతి, సాహితీ ప్రియులని ఏకం చేసే సదుద్దేశంతో 2019 లో బెంగుళూరులో మొదలైన బుక్‌బ్రహ్మ డిజిటల్ మీడియ సంస్థ రచయితలు, పాఠకులు, ప్రచురణకర్తలు, వినియోగదరులను కలిపే ఒక డిజిటల్ వేదిక. పలు కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, వేడుకల ద్వారా గత ఐదేళ్ళనుండి దాదాపు నలభైకి పైగా దేశాలకు చెందిన నూట అరవై మిలియన్లకు పైగా సాహిత్య ప్రియులు సహకారం పొందారు. 6,000 కు పైగా కన్నడ రచయితలు, 20,000 కు పైగా కన్నడ పుస్తకాలు పరిచయం చేసిన బుక్‌బ్రహ్మ సంస్థ తెలుగు, తమిళు, మలయాళం భాషల్లో ఈ దిశగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ సాహిత్య ఉత్సవాలలో భాగమే కాకుండా 2022 లో కన్నడ నవల, కథల పోటీలను పెద్ద ఎత్తులో ప్రయోగించింది
గ్రంథ సంపాదన, పరిశోధన, భాషాశాస్త్రంలో ప్రావీణ్యులైన హం.ప.నా ప్రముఖ కన్నడ రచయితల్లో ఒకరు. కన్నడ సాహిత్య పరిషత్తు అధ్యక్షుడిగా, సెక్రెటిరిగా పని చేసారు. ʼద్రావిడ భాషా విజ్ఞానʼ, ʼపంపభారత సంగ్రహʼ, ʼభరతేశ వైభవʼ, సవ్యసాచి పంపʼ ఇవి ఆయన రచనలు. ʼకర్నాటక సాహిత్య అకాడెమి పురస్కారం, కావ్యానంద పురస్కారం, కర్నాటక రాజ్యోత్సవ పురస్కారం మొదలగు గౌరవ పురస్కారాలు ఆయనకు లభించాయి.
కన్నడ విమర్శకుడు, రచయిత మల్లేపురం జి. వెంకటేశ్‌గారు ప్రస్తుతం సంవిత్ రీసర్చ్ ఫౌండేషన్ సంస్థ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ʼకన్నడ పుస్తక ప్రాధికారʼ సంస్థ అధ్యక్షుడిగా, హంపి కన్నడ యూనివర్సిటి డీన్ అలాగే ʼకర్నాటక సంస్కృతʼ యూనివర్సిటీ విశేషాధికారిగాా సేవలందించారు. ʼశంబా అధ్యయనʼ, ʼసంస్కృతి మత్తు శంబాʼ, ʼసాహిత్య మత్తు పురాణʼ, ʼప్రవాస సాహిత్య-ఒందు అధ్యయనʼ ఇలా సాహిత్యం, భాష, సంస్కృతికి చెందిన 80 కి పైగా రచనలు ప్రచురించారు . ఆయనకు కర్నాటక సాహిత్య అకాడెమి గౌరవ పురస్కారం, కర్నాటక రాజ్యోత్సవ పురస్కారం, డా.బి.ఆర్. అంబేడ్కర్ పురస్కారం, విద్వాన్ ఎన్. రంగనాథశర్మ సంస్కృతి పురస్కారాలు లభించాయి.
నరహళ్ళి బాలసుబ్రహ్మణ్యంగారు కన్నడ విమర్శకుడు, రచయిత. సాహిత్యపు సంకీర్ణ సంగతులని కూడా సులువుగా వివరించగలిగి పాఠకుల్ని హద్దుకునే చాకచక్యం ఆయనది. ʼఅనుసంధానʼ నరహళ్ళిగారి తొలి విమర్శా సంకలనం. ʼనవ్యతెʼ, ʼసాహిత్య సంస్కృతిʼ ʼఅంతరంగద మృదంగʼ, ఇవి ఆయన రచనలు. జి.ఎస్.ఎస్ పురస్కారం, శివరామ కారంత పురస్కారం, కెంపేగౌడ పురస్కారం ఇంకా పలు పురస్కారాలను నరహళ్ళి అందుకున్నారు.
కన్నడ విమర్శకురాలు డా. ఎం.ఎస్.ఆశాదేవి ప్రస్తుతం బెంగుళూరులోని మహారాణి క్లస్టర్ యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో కన్నడ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ʼస్త్రీ మతవనుత్తరిసలాగదే?ʼ ʼనడువె సుళివాత్మʼ, ʼహుదుగలారద దుఃఖʼ ఇలా పలు రచనలను ప్రచురించారు. ఎం.కె. ఇందిరా అవార్డు, ఇన్ ఫోసిస్ అవార్డు, జిఎస్ఎస్ అవార్డు, వి.ఎం. ఇనాందార్ విమర్శా పురస్కారాలను ఆమె పొందారు.
కర్నాటకలో డా. వసుంధరా భూపతిగారిని వైద్యురాలిగా, రచయిత్రిగా గుర్తిస్తారు. విజ్ఞానం, ప్రథమ చికిత్స, శుభ్రత, ఆరోగ్యం ఇలా 150 కి పైగా ఫోన్ -ఇన్ కార్యక్రమాలని ఆవిడ అందించారు. ఆరోగ్య సంగాతి, మనెయంగళదల్లి ఔషధి వన, హూవు మత్తు ఆరోగ్య, ఏడ్స్! ప్రళయ ఎదురిసలు సిద్ధరాగి, ఆహార మత్తు ఆరోగ్య, జీవసెలె ఇలా పలు రచనలు చెప్పుకోవొచ్చు. వసుంధరా భూపతిగారు ʼకర్నాటక విజ్ఞాన తంత్రజ్ఞానʼ అకాడెమినుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం, ʼకర్నాటక రాజ్య పరిసరʼ పురస్కారం, ʼమాతోశ్రీ రత్నమ్మ హెగ్గడె గ్రంథʼ పురస్కారం, విశ్వేశ్వరయ్య పురస్కారం, కెంపేగౌడ పురస్కారాలు అందుకున్నారు.
కన్నడ విమర్శకులు, రచయిత రాజేంద్ర చెన్నిగారు కువెంపు యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ʼదేశీవాదʼ, ʼబేంద్రె కావ్య సంప్రదాయ మత్తు స్వంతికెʼ, ʼసాహిత్య విమర్శెʼ, ʼమాస్తి కతెగళు: ఒందు అధ్యయనʼ, ʼకరుళ బళ్ళియ సొల్లుʼ, ʼనడు హగలినల్లి కందీలుగళుʼ ఇవి ఆయన రచనలు. ʼదొడ్డ మరʼ, ʼమళెయల్లి బందాతʼ కథా సంపుటికలు. ఆయనకు కర్నాటక సాహిత్య అకాడెమి బహుమతి, జి.ఎస్.ఎస్ అవార్డుడులు లభించాయి.
పి. శేషాద్రి కన్నడ సినీ డైరెక్టర్లలో ప్రముఖులు. తరచూ ఏడు సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న ఒకగానొక్క ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ ఈయన. ʼమున్నుడిʼ ఈయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమా. అతిథి, బేరు, తుత్తూరి, విముక్తి, విదాయ, భేటి, మూకజ్జియ కనసుగళు, భారత్ స్టోర్స్, బెట్టద జీవ ఇవి వెండితెర సినిమాలు. అన్నీ దాదాపు కన్నడ నవలలని సినిమాలుగా మలిచినవే. ఇంచర, కామనబిల్లు, మాయామృగ, కణ్ణాముచ్చాలె, ఉయ్యాలె, సుప్రభాత ఇవి టీవి సీరియళ్ళు.
కన్నడ ప్రముఖ విమర్శకులు, పేరుగాంచిన రచయిత, అనువాదకులు అయిన ఓ.ఎల్. నాగభూషణ స్వామిగారు ʼనన్న హిమాలయʼ, ʼనమ్మ కన్నడ కావ్యʼ, ʼఏకాంత లోకాంతʼ, ʼమత్తె తెరెద బాగిలుʼ వంటి పలు రచనలు రచించారు. ʼఅక్క తంగియరుʼ, ʼకన్నడక్కె బంద కవితెʼ, ʼయుద్ధ మత్తు శాంతిʼ ఇవి స్వామిగారు చేసిన అనువాదాలు. పలు కన్నడ రచనలను ఇంగ్లిష్ భాషకి అనువదించిన ఆయన సాహిత్య సేవకుగాను కర్నాటక సాహిత్య అకాడెమి బహుమతి, కర్నాటక ప్రభుత్వం అందించే ʼరాజ్యోత్సవʼ పురస్కారం, జి.ఎస్.ఎస్ పురస్కారాలను ఆయన అందుకున్నారు.
తమిళు రచయిత పావణ్ణన్ నవలా రచన, సాహిత్య విమర్శ, బాలల సాహిత్యం, నాటక రంగాలకు అందించిన సేవ విశేషమైనది. ఈయన దలిత సాహిత్యాన్ని కన్నడ నుండి తమిళు బాషకి అనువాదం చేస్తున్నారు. ʼవాజల్కైʼ, ʼఒరు విసరనైʼ, ʼసితారల్లల్ʼ, ʼపైమరకప్పల్ ఇవి ఆయన రచించిన నవలలు. ʼకుఝంతైయై, పిన్ థోడరుమ్ కాలం లాంటి బాలల సాహిత్యాన్ని ప్రచురించారు. ఆయనకు ఇలకియ సింథనై పురస్కారం, చెన్నై లిటరెచర్ ఫెస్టివల్ అత్యుత్తమ రచయిత పురస్కారం, సాహిత్య అకాడెమి పురస్కారం, కెనడియన్ లిటరలి గార్డన్ నుండి ఇయల్ విరుధు పురస్కారాలు లభించాయి
సుధాకరన్ రమంతళ్ళి అనువాదకులు, రచయిత, వాగ్మి, సుధాకరన్ రమంతళ్ళి కన్నడనుండి మలయాళం బాషకు 27 రచనలను అనువదించారు. బెంగుళూరు కనకదాస అధ్యయన పరిశోధన కేంద్రంలో సమన్వయకర్త, సంపాదకులిగా సేవలందించారు. పింగామి, ఆరంగోళియున్న అచ్యుతన్ పుస్తకాలు ప్రచురించారు. కరిమాయి, జోకుమారస్వామి, అతిక్రమణం, శిఖర సూర్యన్ ఇవి ఆయన అనువదించిన ప్రముఖ రచనలు. సాహిత్య అకాడెమి అనువాద పురస్కారం, కర్నాటక సాహిత్య అకాడెమి పురస్కారం, పూర్ణ ఉరూబ్ పురస్కారాలను ఆయన అందుకున్నారు.
అజయ్ వర్మా అల్లూరి కన్నడ సాహిత్యంలో యువ రచయిత, అనువాదకుడిగా గుర్తించబడ్డారు. ఇంగ్లిష్, ఒడియ, హింది, మలయాళం భాషలకు వర్మా కవితలు అనువదించబడ్డాయి. గగనసింధు, డయానా మర, కలల కన్నీటి పాట ఇవి కవితా సంకలనాలు. విముక్తె, నాల్కనే ఎకరె, ఆర్. ఎస్. ఎస్: లోతుపాతులు ఇవి అజయ్ అనువాదం చేసిన రచనలు. కువెంపు భాషా భారతి పురస్కారం, ప్రహ్లాద అగసనకట్టె కథా పురస్కారాలు అతను అందుకున్నారు.